Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వాతావరణ మార్పుల కారణంగా.. శుక్రవారం నుండి మూడు రోజులు దేశంలోని పలు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం పంట కోత సమయం. పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు కురిస్తే రైతులు చాలా నష్టపోయే ప్రమాదం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు ఎల్లో వార్నింగ్‌ను జారీ చేశారు.
ఈ రాష్ట్రాల్లో వర్షాల్లో..
దక్షిణ అండమాన్ సముద్రం, అండమాన్, నికోబార్, అస్సాం, ఒడిశా, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లలో రానున్న రెండు, మూడు రోజులలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. తూర్పు, మధ్య, ఈశాన్య భారతదేశంలో సగటు ఉష్ణోగ్రత మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు పడిపోతుందని తెలిపారు.
ఫలితంగా ప్రజలకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. ఇక పంజాబ్, ఉత్తర రాజస్థాన్, హర్యానా, చంఢగీర్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్‌లలో రాబోయే 24 గంటల్లో బలమైన గాలులు వీస్తాయన్నారు. కేరళ, జమ్మూ కాశ్మీర్, లడఖ్ లోని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడవచ్చని చెప్పారు.
ఈ ప్రాంతాల్లో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు..
ఒడిశా, గంగా పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. రానున్న రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.