Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా స్వైరవిహారం చేస్తున్నది. కరోనా రెండో దశ భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి.. గడిచిన 24 గంటల్లో 11,13,966 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..81,466 కొత్త కేసులు వెలుగుచూశాయి. సుమారు ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కరోనా కేసులునమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసులసంఖ్య 1,23,03, 131 చేరింది. గడిచిన 24 గంటల్లో 469 మంది చనిపోయారు. దీంతో మొత్తం గా 1,63,396 మంది ఈ మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిం చింది. మహరాష్ట్రను కరోనా పట్టి పీడిస్తోంది. దేశవ్యాప్తంగా బయటపడుతోన్న మొత్తం కేసుల్లో సగానికి పైగా ఆ రాష్ట్రంలోనే వెలుగుచూస్తున్నాయి. నిన్న 43,183 మందికి పాజిటివ్‌గా తేలగా..249 మంది మరణించారు.