Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐసీసీి సీనియర్ నాయకులు హనుమంతరావు
- విశాఖ ఉక్కు పరిరక్షణకు కార్మిక, ప్రజా సంఘాల దీక్షలు ప్రారంభం
విశాఖ: త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రాణాలు అర్పించైనా కాపాడుకుంటామని ఎఐసిసి సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల వైజాగ్ స్టీల్‌ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ (జెఎసి) ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షా శిబిరాన్ని హనుమంత రావు సందర్శించి, మాట్లాడారు. సొంత గనులు లేకుండానే 18 వేల కోట్ల టర్నోవర్‌ను విశాఖ స్టీల్‌ప్లాంట్ సాధించిందని, అటువంటి సంస్థను ప్రైవేట్‌పరం చేస్తామంటే ఎలా ఊరుకుంటామన్నారు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లా డుతూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆంధ్రుల శాశ్వత హక్కు అని, ప్రైవేటుపరం కాకుండా, ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. దీక్షలను ప్రారంభించిన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ... వైజాగ్ స్టీల్ ప్లాంట్‌తో సహా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవే టుపరం చేసే విధానాలకు మోడీ ప్రభుత్వం స్వస్తి చెప్పే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విశాఖలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ (డిసిఐ), సేలం, భద్రావతి, దుర్గాపూర్ వంటి 12 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తే పోరాటాల ద్వారా అడ్డుకున్నామన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు మాట్లా డుతూ..ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి త్వరగా అన్ని రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలను కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఎఐటి యుసి జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ మాట్లాడుతూ.. పోరాటాలను మరింత ఉధృతం చేస్తా మని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఆయా సంఘాల కార్యకర్తలు 50 మంది దీక్షల్లో కూర్చున్నారు.