Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్లో వార్షిక విద్యుత్ డిమాండ్ గత 35 ఏండ్లలో మొదటిసారిగా 2020-21 మార్చి నెలలో పడిపోయింది. మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ డిమాండ్ ఒక శాతం పడిపోయినట్లు ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్రం విధించిన లాక్డౌన్తో.. గత ఏడాది ఆగస్టు నుంచి వరుసగా ఆరు నెలల పాటు విద్యుత్ విని యోగం క్షీణించినట్లు నివేదికలో వెల్లడైందని రాయిటర్స్ తెలిపింది. గతేడాదితో పోలిస్తే 2020-21లో విద్యుత్ ఉత్పత్తి 0.2 శాతం పడిపోయిందని పొసొకొ డేటాలో వెల్లడైంది. ఫెడరల్ గ్రిడ్ ఆపరేటర్ పొసొకొ నుంచి పంపిన రోజువారీ డేటాను రాయిటర్స్ విశ్లేషించింది. వరుసగా ఏడవ నెలవారీ పెరుగుదల మార్చి 2010 నుండి వేగవంత మైందని, అప్పటి నుండి విద్యుత్ డిమాండ్ పెరిగిందని తెలిపింది. భారత్లో మార్చి 2020 చివరి వారంలో లాక్డౌన్తో విద్యుత్ వినియోగం గణనీయంగా పడిపోయిందని తెలిపింది. విద్యుత్ డిమాండ్ వృద్ధి డేటాను 1985-1986లో నుంచి లెక్కించడం ప్రారంభించారు. అప్పటి నుండి ఏటా వినియోగం పెరుగుతూనే ఉంది.