Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఎస్ఎస్ పై కేరళ సీఎం విజయన్ ఆగ్రహం
తిరువనంతపురం : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు(ఆర్ఎస్ఎస్)పై కేరళ సీఎం, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు పినరయి విజయన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసేందుకు ఏవిధంగానైనా ప్రయత్నిస్తే.. ఆర్ఎస్ఎస్ ఊహించని విధంగా కేరళ గుణపాఠం చెబుతుందని శుక్రవారం హెచ్చరించారు. రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వచ్చిన త్రిపుర సీఎం బిప్లవ్‌కుమార్ మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో బీజేపీ అతితక్కువ ఉనికి నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు వెళ్లిందని వ్యాఖ్యానించారు. దీనిపై విజయన్ స్పందిస్తూ.. 'త్రిపురలో ఎన్నికల ప్రక్రియను దెబ్బతీశామనీ, కేరళలో కూడా అదే పునరావృతం అవుతుందని బీజేపీ నాయకత్వం ప్రకటించింది. ఇది చాలా తీవ్రమైన అంశం. కేరళలో అసలు ఏ స్థానంలోనూ గెలించేందుకు అవకాశం లేని పార్టీ బీజేపీ. అయినప్పటికీ బిజెపికి చెందిన పలువురు ప్రముఖ నాయకుడు కేరళకు రాజకీయపరమైన ముప్పును లేవనెత్తారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయాలని అనుకుంటే.. సంఫ్‌ు పరివార్ ఊహించని విధంగా కేరళ ప్రతిఘటిస్తుంది' అని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ మతతత్వ కుట్రలకు కేరళలో స్థానం లేదని పేర్కొన్నారు. మతతత్వానికి ఇక్కడి ప్రజలు మద్దతు ఇవ్వరని, పలు ఎన్నికల ఫలితాలు ఇందుకు సాక్ష్యమని విజయన్ అన్నారు. త్రిపురలో కాంగ్రెస్‌ను మింగేసిన బీజేపీ అక్కడ శక్తివంతంగా మారిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, ఇండియన్ ముస్లిం లీగ్‌లు అటువంటి ప్రయత్నాలు చేసిన సమయంలో కేరళ ప్రజలు వామపక్షాలతో నిలబడ్డారనీ, 'కాంగ్రెస్-లీగ్-బీజేపీ' అవకాశవాద రాజకీయ పొత్తును లౌకిక మైండ్‌సెట్ ఉన్న కేరళ అరేబియా సముద్రంలో కలిపేస్తుందని విజయన్ పేర్కొన్నారు.
వరదలు మానవ నిర్మితం కావు
2018 వరదలు మానవ నిర్మితమంటూ ఒక అధ్యయనం పేర్కొదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై విజయన్ తీవ్రంగా స్పందించారు. భారీ వర్షపాతం కారణంగానే వరదలు సంభవించాయనీ, డ్యామ్‌ల మేనేజ్మెంట్ కారణంగా వరద తీవ్రత గణనీయంగా తగ్గిందన్న విషయాన్ని సెంట్రల్ వాటర్ కమిషన్ అధ్యయనంతో పాటు ఐఐటీ మద్రాస్‌కు చెందిన సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేసిన అధ్యయనంలో తేలిందని తెలిపారు. పూర్తి పరిశీలన అనంతరం ఐఐటీ మద్రాస్ నివేదికను ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ 'కరెంట్ సైన్స్' కూడా ప్రచురించిందని అన్నారు.