Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్ అల్వార్‌లో బరితెగింపు
- బీజేపీ శ్రేణుల దౌర్జన్యకాండ : రాకేశ్ తికాయత్
అల్వార్ : రైతు ఉద్యమం మొదలై 126వ రోజు.. రైతునేతపై బీజేపీ శ్రేణులు రాళ్లదాడికి దిగారు. రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతం మీదగా రైతు నేత రాకేశ్ తికాయత్ కారులో వెళ్తుండగా.. ఆయన కాన్వారుపై ఒక్కసారిగా రాళ్లవర్షం కురిసింది. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కారులో ఉన్న తికాయత్ కిందకు దిగి.. రోడ్డుపైనే బైటాయించారు.
ఏం జరిగింది..?
రాజస్థాన్‌లోని బన్సూర్‌లో కిసాన్ మహాపంచాయత్‌కు హాజరుకావటానికి బీకేఎస్ నేత రాకేశ్ తికాయత్ కారులో బయలుదేరారు. ఆయన వెంట మరికొంతమంది రైతు నేతలు వేరే కార్లలో వెళ్తున్నారు. శుక్రవారం అల్వార్‌లోని టార్టార్పూర్ కూడలి ప్రాంతానికి వారి కాన్వారు చేరుకున్నది. ఈ విషయం ముందుగానే తెలిసిన బీజేపీ శ్రేణులు అక్కడ కాపుకాశారు. ఆ ప్రాం తానికి వాహనాలు చేరుకోగానే.. రైల్వేట్రాక్‌పై ఉన్న రాళ్లు రువ్వారు. హఠాత్తుగా రాళ్లు పడటంతో రైతునేతలంతా అప్రమత్తమయ్యారు. కార్లలోనుంచి వారు దిగ టంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టార్టార్పూర్ రోడ్డుపైనే ఆందోళనకు దిగారు. అక్కడి స్థానిక రైతులు వారికి మద్దతుగా నిలిచారు. మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లచట్టాలను వెనక్కితీసుకునేదాకా.. మా ప్రాణా లుపోయినా ఉద్యమపోరు ఆగదని ఈసందర్భంగా రాకేశ్‌తికాయత్ స్పష్టంచేశారు.
ట్రాఫిక్ జామ్‌లో వాహనాలు
రోడ్డుపై రైతులు ఆందోళనకు దిగటంతో.. ఆ మార్గంలో వెళ్లే వాహనాలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సుమారు అరగంటసేపు రైతులు రోడ్డుపైనే బైటాయించారు. దాడికిపాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేదాకా ఆందోళన కొనసాగిస్తామని రాకేశ్ తికాయత్ స్పష్టంచేశారు. పరిసరాల్లో ఉన్న ఇద్దరు బీజేపీ కార్యకర్తలను పట్టుకోగా.. మిగతా వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బన్సూర్‌లో కిసాన్పంచాయతీ సమావేశం ఉండటంతో.. అక్కడినుంచి వాహనాలు కదిలాయి. కాగా, దాడి జరిగిన విషయం తెలియగానే.. దేశంలో పలు ప్రాంతాల్లో రైతులు రాస్తారోకోలు నిర్వహించారు. ఇప్పటిదాకా రైతు ఉద్యమంపై వ్యతిరేక ప్రచారం చేస్తూ వచ్చిన బీజేపీ.. ఇప్పుడు భౌతికదాడులకు దిగటంతో సర్వత్రాచర్చనీయాంశంగా మారింది.