Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలోనే ఉత్తమ ఉన్నత విద్యా సంస్థగా బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిలవగా.. బెంగాల్లోని కోల్కతా యూనివర్సిటీ దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచింది. తాజాగా ప్రచురించిన అకాడమిక్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్ (ఏఆర్డబ్ల్యూయూ-2020 ర్యాంకింగ్స్) ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి.షాంఘై ర్యాంకింగ్ ప్రకారం.. దేశంలో టాప్ ఉన్నత విద్యా సంస్థలు వరుసగా.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ర్యాంకు 1), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ర్యాంకు 2-4), యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా (ర్యాంకు 2-4), యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ (ర్యాంకు 2-4), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (ర్యాంకు 5-7), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఖరగ్పూర్ (ర్యాంకు 5-7), జవహర్లాల్ నేహ్రూ యూనివర్సిటీ (ర్యాంకు 5-7),అలీఘర్ ముస్లీ యూనివర్సిటీ (8-9), వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (8-9), ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (10-15) ఉన్నాయి. ఇదిలా ఉండగా, ప్రపంచంలోని టాప్ 100 జాబితాలో మాత్రం ఏ ఒక్క భారతీయ విద్యా సంస్థకు చోటుదక్కలేదు. దేశంలో ఉత్తమ ఉన్నత విద్యాసంస్థగా నిలిచిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు 501-600 కేటగిరీలో ఉంది. వర్సీటీల్లో దేశంలోనే ఉత్తమంగా కోల్కతా యూనివర్సిటీ నిలవడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆనంద వ్యక్తం చేస్తూ.. వర్సిటీ సిబ్బంది అందరిని అభినందించారు. కాగా, ప్రపంచంలోనే టాప్ వర్సిటీలలో హర్వర్డ్ యూనివర్సిటీ, సాన్ఫోర్డ్ యూనివర్సీటీ, యూనివర్సీటి ఆఫ్ కేమ్బ్రిడ్జి, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలు టాప్-5లో ఉన్నాయి.