Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ : కొత్త విద్యా సంవత్సరం 2021-22 లో తగ్గించిన సిలబస్‌ను తిరిగి పునరుద్ధరిస్తున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. కరోనా విస్తరిస్తున్న కారణంగా.. పాఠశాలలను నెలలతరబడి మూసివేయడంతో, గత విద్యా సంవత్సరం 2020-21 లో 9 వ తరగతి నుంచి 12 వ తరగతుల వరకు సిలబస్ ను 30 శాతం వరకు సీబీఎస్ఈ తగ్గించింది. దానికనుగుణంగానే మే, జూన్ నెలల్లో పరీక్షలు నిర్వహించనుంది. కొత్త విద్యా సంవత్సరానికి ప్రకటించిన బోధన ప్రణాళిక ప్రకారం సిలబస్ తగ్గింపు ఏమీ ఉండదని సీబీఎస్ఈ స్పష్టం చేసింది.