Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కతా : పశ్చిమబెంగాల్లో జరిగిన గత మూడు ఎన్నికలతో పోల్చుకుంటే కీలకమైన నందిగ్రామ్ నియోజకవర్గంలో ఈదఫా అధిక పోలింగ్ శాతం నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. నాలుగింట ఒక వంతు పోలింగ్ కేంద్రాల్లో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడంతో మొత్తం నందిగ్రామ్‌లో రికార్డు స్థాయిలో 88.01 శాతం పోలింగ్ నమోదైందని తెలిపింది. పోలింగ్ కేంద్రం వారీగా నమోదైన పోలింగ్ అప్డేటెడ్ వివరాలను ఈసీ శనివారం విడుదల చేసింది. నందిగ్రామ్ నియోజకవర్గం ఉన్న తూర్పు మిడ్నాపూర్‌లో సరాసరిన 87.4 శాతం పోలింగ్ నమోదు కాగా, నందిగ్రామ్‌లో అంతకంటే కొంత ఎక్కువగా 88.01 నమోదైంది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇక్కడ వరుసగా 85.7, 85 శాతం చొప్పున పోలింగ్ శాతం నమోదు కాగా, 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 86.9 శాతం ఓటర్లు ఓటేశారు. ఒక్క 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నందిగ్రామ్‌లో 88.3 శాతం పోలింగ్ రికార్డైంది. ఈ స్థానంలో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టిఎంసి తరపున రాష్ట్ర సిఎం, ఆ పార్టీ అధినేత్రి మమత బెనర్జీ, బిజెపి తరపున సువేందు అధికారి, సిపిఎం తరపున మీనాక్షి ముఖర్జీ వంటి హేమాహేమీలు పోటీపడ్డారు.