Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాస్పిటల్లో పరిస్థితి విషమం
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో దళితులపై దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా ఒక 22 ఏండ్ల దళిత యువకుడ్ని పెత్తందారీ వర్గానికి చెందిన నలుగురు యువకులు అత్యంత పాశవికంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. '' మా కుటుంబానికి చెందిన అమ్మాయితో మాట్లాడతావా?'' అంటూ లేనిపోని అనుమానాలను సృష్టించి లక్ష్మీపూర్ ఖేరీ గ్రామానికి చెందిన ఒక యువకుడ్ని కొంతమంది యువకులు దారుణంగా కొట్టారు. శరీరంపై ఎక్కడపడితే అక్కడ ఇనుప రాడ్తో కొట్టి..గాయపర్చారు. తీవ్రంగా గాయపడిన బాధిత యువకుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారని సమాచారం. టికోనియా స్టేషన్ హౌస్ అధికారి గ్యాన్ ప్రకాశ్ తివారీ మాట్లాడుతూ, బాధితుడి సోదరుడు ఫిర్యాదుమేరకు ఎఫ్ఐఆర్ నమోదుచేశామని, నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు. ఐపీసీలోని సెక్షన్ 323, సెక్షన్ 506 , ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని ఆయన అన్నారు.