Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శారదా చిట్‌ఫంట్ స్కాం కేసుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ నేతలకు చెందిన దాదాపు రూ.3 కోట్ల విలువైన అస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పిఎంఎల్ఎ) కింద టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్, ఎంపి శతాబ్ధి రారు, దేబ్జాని ముఖర్జీలకు చెందిన స్థిర, చరాస్థులను అటాచ్ చేసేందుకు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది. కునాల్ ఘోష్ మీడియా గ్రూప్ శారదా సీఈఓగా ఉన్నారని, అదేవిధంగా శారదా బ్రాండ్ అంబాసిడర్‌గా శతాబ్ధిరారు, శారదా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు దేబ్జాని ముఖర్జీ డైరెక్టర్‌గా ఉన్నారని ఇడి పేర్కొంది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి రూ.600 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలిపింది. పోంజి స్కాంలో మనీల్యాండరింగ్ కోణాన్ని ఈడీ 2013, ఏప్రిల్ నుంచి విచారణ చేస్తోంది. పెట్టుబడులకు ఆధిక రాబడులను ఇస్తామని హామీ ఇచ్చి వేలాది మంది డిపాజిటర్లను మోసం చేశారన్న ఆరోపణలు శారదా గ్రూప్‌పై ఉన్నాయి.