Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతన్నలపై హర్యానా రోహతక్‌లో పోలీసులు లాఠీలు ప్రయోగించటాన్ని ఎస్కేఎం తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై పోలీసులు దాష్టీకంగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించింది. పోలీసుల దాడిలో చాలా మంది రైతులు గాయాల పాలవటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి దాడులకు తాము బెదిరేది లేదని స్పష్టంచేసింది. చట్టాలను వెనక్కి తీసుకునే
వరకూ.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపింది. రైతులను ఇబ్బందులకు గురిచేసేందుకే రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం తొలి నుంచి ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నేతలు రైతుల ఉద్యమాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్యానా ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర:లో రైతులు, సామాన్య ప్రజానీకం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారని గుర్తు చేసింది. ఆ చట్టాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది. తప్పుడు కేసులు బనాయించి బీకేయూ యువ నాయకుడు రవి ఆజాద్‌ను అరెస్టు చేశారనీ, ఆయనను తక్షణమే విడుదల చేయాలని కోరింది. ఈ మేరకు ఎస్కేఎం నేత దర్శన్ పాల్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ వాహనంపై దాడి చేసిన తర్వాత ఆయన మొక్కవోని దీక్షతో కిసాన్ మహాపంచాయత్‌లలో పాల్గొన్నారని పేర్కొంది.