Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరికి తీవ్ర గాయాలు...
న్యూఢిల్లీ : రైతు సంఘాల నాయకులపైనా, రైతులపైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా నేత తికాయత్‌పై బీజేపి గూండాలు దాడి చేయగా శనివారం హర్యానా ప్రభుత్వం తన పోలీసుల చేత రైతులపై దాడి చేయించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నిరంకుశ చట్టాలను నిరసిస్తూ అన్నదాతలు శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న సమయంలో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. నెత్తురోడుతున్నా వదలకుండా దాడికి పాల్పడ్డారు. రోహ్తక్ జిల్లా అస్తాల్ బోహార్ వద్ద జరిగిన ఈ ఘటనలో పులువురు రైతులు గాయపడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయల య్యాయి. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ హెలికాప్టర్ దిగవలసిన అస్తాల్ బోహార్ వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడి నిరసన తెలియజేస్తున్న సమయంలో ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని పోలీ సులు బెదిరించారు. శాంతి యుతంగా నిరసన తెలిపే హక్కు ఉందంటూ నిరస న కొనసా గించడంతో పోలీసులు ఈ దాడికి పాల ్పడ్డారు. వృద్ధులు, మహిళల అని కూడా చూడకుండా చితకబాదారు. పోలీసుల దాడిని ఖండిస్తూ రైతులు రోహ్తక్ రోడ్డును దిగ్భందించారు. ఆ ప్రాంతమంతా 'ఖట్టర్ గో బ్యాక్' అంటూ నినాదాల హౌరెత్తాయి. పోలీసులు అణచివేతను సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) తీవ్రంగా ఖండించింది. కాగా బికెయు హర్యానా యువనేత రవి ఆజాద్‌పై అక్రమ కేసులు బనాయించి హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ఆజాద్ అరెస్టును తీవ్రంగా ఖండించిన ఎస్‌కెఎం ఆయనను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. నిరసన తెలిపే పౌరుల రాజ్యాంగ హక్కును అరికట్టడానికి ప్రయత్నిస్తూ 'రికవరీ ఆఫ్ డేమేజ్ టూ పబ్లిక్ ప్రోపర్టీ యాక్ట్' వంటి కఠినమైన కొత్త చట్టాలను అమలు చేయడానికి వ్యతిరేకంగా ఫతేహాబాద్లో రాష్ట్ర స్థాయి కన్వెన్షన్ నిర్వహించారు. ఈ నిరంకుశ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసహరించుకోవాలని ఎస్‌కెఎం డిమాండ్ చేసింది.
అలీగఢ్‌లో మహాపంచాయత్
రాజస్థాన్‌లో బీజేపీ గూండాల దాడి నుంచి తృటిలో తప్పించుకున్న రాకేశ్ తికాయిత్ శనివారం ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో జరిగిన భారీ మహా పంచాయత్‌లో పాల్గొన్నారు. అనంతరం ఘాజీపూర్ సరిహద్దుల్లో మీడియాతో మాట్లాడారు. రాజస్థాన్‌లో తనపై జరిగిన దాడి వెనుక బిజెపి యువజన విభాగం ఉందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఉద్యమానికి అండగా ఉంటాం
ఎస్‌కెఎం నేత్రత్వంలో శనివారం లుధియానాలోని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, విశ్వవిద్యాలయ సిబ్బంది, ఇతర ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. పిఎయు టీచర్స్ యూనియన్, పిఎయు ఎంప్లాయీస్ యూనియన్, పిఎయు స్టూడెంట్స్ యూనియన్ నిర్వహించిన ఈ సమావేశంలో 100 కు పైగా సంఘాలు పాల్గొన్నాయి. రైతన్నల ఉద్యమానికి అండగా నిలుస్తామని ప్రతీనబూనారు. ఈ సమావేశంలో ఎస్‌కెఎం నేతలు జగ్జీత్ సింగ్ దల్లెవాల్, నిర్భరు సింగ్, బల్బీర్ సింగ్ రాజేవాల్, ముఖేష్ చంద్ర, మంజీత్ సింగ్ ధన్నర్, దర్శన్ పాల్, హర్మీత్ సింగ్ కడియన్ తదితరులు పాల్గొన్నారు.