Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా రెండో దశ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిపై పోరాడేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లడం అవసరమని ఎయిమ్స్ పేర్కొంది. కరోనా నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరముందని, చిన్నపాటి లాక్డౌన్లు విధించడం అత్యవసరమని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా అన్నారు. ఆర్థిక వ్యవస్థపై అంతగా ప్రభావం చూపని విధంగా చర్యలను చేపట్టవచ్చని సూచించారు. ముఖ్యంగా అనవసరపు ప్రయాణాలు చేయకూడదని అన్నారు. దీనిద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని స్పష్టం చేశారు. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 93,249 కేసులునమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్ అనంతరం ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్లో 93,337 కేసులు నిర్థారణయ్యాయి. కేసుల సంఖ్యను తగ్గించేందుకు మరింత తీవ్రంగా కషిచేయాలని, కంటైన్మెంట్ జోన్లు ప్రకటించడంతో పాటు లాక్డౌన్లు, కరోనా నిర్థారణ పరీక్షలు, ట్రేసింగ్, ఐసోలేషన్ వంటి చర్యలను విస్తృతంగా చేపట్టాలని గులేరియా అన్నారు.