Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుహవతి : తముల్పూర్లో పోలింగ్‌ను వాయిదా వేయాలని కోరుతూ అసోం బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీపీఎఫ్ అభ్యర్థి రంజా ఖుంగూర్ బసుమాటరి పోలింగ్‌కు వారం రోజుల ముందు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువు కూడా ముగిసిన అనంతరం బీజేపీ ఫిరాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసోంలోని బక్సా జిల్లా తముల్పూర్లో మూడో దశ ఎన్నికల్లో భాగంగా మంగళవారం పోలింగ్ జరగనుంది. ఎన్నికలు వాయిదా వెయ్యాలని, అలాగే తమ అభ్యర్థిని మార్చుకునేందుకు అనుమతినివ్వాలంటూ ఎలక్షన్ కమిషన్‌కు రెండు సార్లు లేఖ కూడా రాసినట్టు బీపీఎఫ్ చీఫ్ మొహిలరీ హంగ్రామా తెలిపారు. పార్టీ నామినేట్ చేసిన అభ్యర్థి రంజా ఖుంగూర్ బసపుమాటరీ లంచంతో పాటు బీజేపీ కుట్రతో పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు బిజెపిలోకి వెళ్లాడని మొహిలరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలింగ్‌ను రద్దు చేయాలని, అసోం మంత్రి హిమంత బిస్వా శర్మ, కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌లపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని మొహిలారి రాశారు. బీజేపీ చీఫ్ జెపి.నడ్డా, అపోం ముఖ్యమంత్రి సర్బదానంద సోనోవాల్, అస్సాం బీజేఈ చీఫ్ రంజీత్ కుమార్దాస్ల పేర్లను కూడా అందులో పేర్కొన్నారు. పోలింగ్‌ను వాయిదా వేయాలంటూ బీపీఎఫ్‌కు కాంగ్రెస్ కూడా మద్దతిచ్చింది.