Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒడిశా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల దుశ్చర్య
భువనేశ్వర్ : క్రమశిక్షణ, విలువల గురించి పెద్ద పెద్ద కబుర్లు చెప్పే బీజేపీ ఒడిశా అసెంబ్లీలో బీభత్సం సృష్టించింది. బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంలోకి బూట్లు, హెడ్ ఫోన్స్, పేపర్లు, చెత్త బుట్టలు విసిరికొడుతూ నానా యాగీ చేశారు. మైనింగ్‌లో అవినీతికి సంబంధించి ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్క రించారు. స్పీకర్ సూర్య నారాయణ్ పాత్రో పక్షపాతంతో వ్యవహరి స్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు వీరంగం చేశారు. అనుచితంగా వ్యవహరించిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు (బిష్టు సేథి, జయ నారాయణ్ మిశ్రా, మోహన్ చరణ్ మఝి)ను బడ్టెట్ సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. బీజేపీ ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తనను అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్ ఖండించారు. ఇందుకు సంబంధించిన వీడియోలో ఈ విషయం స్పష్టమవడంతో, పరిశీలించిన స్పీకర్ ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడు నరసింగ మిశ్రా ఈ ఘటనను ఖండించారు.