Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీగఢ్ : పంజాబ్‌లోని జలంధర్‌లో దళిత బాలికపై ఎనిమిదిమంది సామూహిక లైంగికదాడికి పాల్పడిన దారుణ ఘటన తాజాగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్‌లోని నిరుపేద దళిత కుటుంబానికి చెందిన బాలికను అదే ప్రాంతానికి చెందిన సందీప్ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. గత నెల 15న ఫోన్ చేసి, 16న తనతో వస్తే జలంధర్ వెళ్లి పెళ్లి చేసుకుందా మన్నాడు. 16వ తేదీ ఉదయం ఆ బాలిక పంజాబ్‌లోని కిలియన్ వాలీ వద్దకు వెళ్లింది. అక్కడికి సందీప్ చేరుకుని జలంధర్‌లోని ఓ గదికి తీసుకెళ్లాడు. అప్పటికి అక్కడే ఉన్న మరో ఏడుగురితో కలిసి ఆమెపై లైంగికదా డికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత గత నెల 20న బాలికను ఇంటి బయట పడేసి వెళ్లిపోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురునిందితులను అరెస్ట్‌చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు.