Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొత్తం అసెంబ్లీ స్థానాలు-140
- ఒకే దశ పోలింగ్ ఏప్రిల్ 6న
- మ్యాజిక్ ఫిగర్- 71
- ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య పోటీ
- తుఫాన్లు, కరోనా సంక్షోభంలో ప్రభుత్వ పనితీరుకు ప్రశంసలు
- హిందూత్వాన్ని నమ్ముకున్న బీజేపీ
- అంతర్గత కుమ్ములాటలో కాంగ్రెస్
- ప్రధాని మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ..జాతీయ స్థాయి నాయకులంతా కేరళ అసెంబ్లీ ఎన్నికలపై సీరియస్‌గా దృష్టిసారించారు. అయితే కేరళ ప్రజలు మరోమారు వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్డీఎఫ్) వైపే మొగ్గుచూపుతున్నారని విశ్వసనీయ సమాచారం ఉంది. సీఎం పినరరు విజయన్ నేతృత్వంలో ప్రభుత్వ పాలన పట్ల అక్కడి ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని వార్తా కథనాలు వెలువడుతున్నాయి. పోల్ సర్వేలోనూ అదే కనపడింది.
- 1977లో తప్ప కేరళీయులు ప్రతీ ఐదేండ్లకు ప్రభుత్వాన్ని మార్చేస్తున్నారు. 2016 ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌కు 91 స్థానాల్లో విజయం సాధించింది. యుడిఎఫ్‌కు 47 స్థానాలు దక్కాయి. 2019 పార్లమెంటు ఎన్నికలలో మోడీ హవా కేరళలో పనిచేయలేదు. కేవలం ఒక్కస్థానంతో సరిపెట్టుకుంది.
- భీకరమైన తుఫాన్లు కేరళను వణికించినవేళ, వామపక్షాల పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నారు. సురక్షిత ప్రదేశాలకు తరలించి, వారిని కంటికి రెప్పలా చూసుకున్నారు. ఇండ్లు కోల్పోయిన పేదలకు ఇండ్లు కట్టివ్వటం, పంట నష్టం వాటిల్లిన రైతును ఆదుకోవటంతో ఎల్డీఎఫ్ పాలనను ప్రజలు మరిచిపోలేని పరిస్థితి.
- ఎల్డీఎఫ్ను దెబ్బకొట్టడానికి కేరళలో బీజేపీ, కాంగ్రెస్ చేతులు కలిపాయని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఉదాహరణకు శబరిమలలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్, బీజేపీ రాజకీయంగా వాడుకున్నాయి. ప్రజల్లో భావోద్వేగాలతో లబ్దిపొందాలని చూశాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో శబరిమల అంశం ప్రభావం చూపకపోవచ్చునని తెలుస్తోంది.
- ఎల్డీఎఫ్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సేవల్లో టెక్నాలజీ పెరిగింది. ప్రభుత్వాఫీసుల్లో సమయపాలన, సమస్యలతో వచ్చేవారిని పట్టించుకోవటం...వంటివి బాగా అమలుజేశారు. పర్యావరణం, వేస్ట్ మేనేజ్మెంట్, హైటెక్ క్లాస్‌రూమ్స్, పేదలకు ఇండ్లు. మౌలిక వసతులు బాగా అభివృద్ధి చేశారు. వరదల్లో ప్రభుత్వ కృషి చూసి, సీఎం డిజాస్టర్ ఫండ్‌కి దాదాపు రూ.5 వేల కోట్లు విరాళాలు వచ్చాయి.
- నీఫా వైరస్, కరోనా సమయంలో కేరళ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేసిందని అందరూ మెచ్చుకున్నారు. తర్వాత కరోనా మళ్లీ విజృంభించినా, కట్టడి చేయడానికి ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తోందని కూడా ప్రజలు నమ్ముతున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం పినరరు విజయన్‌కు మకిలి అంటిద్దామని బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. సఫలం కాలేదు.