Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ సీఎం విజయన్
కన్నూర్ : కేరళ అభివృద్ధి ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించాయని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. రాష్ట్రం గురించి ప్రతిపక్షాలు యూడీఎఫ్, బీజేపీలు దేశానికి ఒక్క మంచి మాట కూడా చెప్పలేదని అన్నారు. గత ఐదేండ్లలో అసాధారణ విపత్తులు, ఆరోగ్య సవాళ్లు, కేంద్ర ప్రభుత్వ అడ్డంకులు వంటి అన్ని అవంతరాలను అధిగమించి కేరళ చాలా దూరం ప్రయాణించిందని చెప్పారు. రాష్ట్రానికి ఉన్న పరిమిత పరిధిలోనూ ప్రత్యామ్నాయ విధానం ఆచరణాత్మకమైనదని ఎల్డీఎఫ్ నిరూపించిందని తెలిపారు. కన్నూర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మతతత్వంతో పోరాడటానికి, లౌకికవాదాన్ని రక్షించడానికి ఎల్డిఎఫ్ ఇంకా బలోపేతం కావా లని అన్నారు. కేరళ నేలనుంచి వామపక్షాలను తుడిచిపెట్టాలని శపథం చేసిన శక్తులు, కొన్ని మీడియా సంస్థలు రాష్ట్రంలో ప్రతిపక్ష సభ్యులుగా కొనసాగుతున్నాయని విమర్శించారు.