Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
- హర్యానాలో మహా పంచాయత్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్న రైతాంగానికి మద్దతునిచ్చిందుకు కేంద్ర ప్రభుత్వం తమపై కక్ష కట్టిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ పార్లమెంట్లో బిల్లు తీసుకువచ్చిందని విమర్శించారు. ఆదివారం నాడు హర్యానాలోని జింద్‌లో జరిగిన కిసాన్ మహా పంచాయత్‌లో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజ్రీవాల్‌ను శిక్షించేందుకు వాళ్లు (కేంద్రం) పార్లమెంటులో బిల్లు పెట్టారని చెప్పారు. 'ఈ విషయమై మేము స్వాతంత్య్ర పోరాటం చేయాలా' అని కేజ్రీవాల్ సూటిగా ప్రశ్నించారు. ఆందోళనల్లో భాగంగా ప్రాణత్యాగాలు చేసిన 300 మంది రైతులకు తాము సెల్యూట్ చేస్తున్నామని, వారి త్యాగాలను వథా కానీయకుండా చూడటం మనందరి బాధ్యతని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలోని స్టేడియంలను జైళ్లుగా మార్యాలని కేంద్రం తమపై ఒత్తడి తెచ్చినట్టు కేజ్రీవాల్ తెలిపారు. రైతులు తప్పేమీ లేదంటూ ఆ ప్రతిపాదనను తాము తోసిపుచ్చామని చెప్పారు. ఢిల్లీకి వచ్చే రైతులను రాజధానిలోని తొమ్మిది స్టేడియంలలోకి పంపి, వాటిని జైళ్లుగా మార్చాలని బిజెపి నేతృతంలోని కేంద్రం కుట్ర పన్నిందని చెప్పారు.
127వ రోజుకు ఆందోళన
మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లోని రైతులు ఆందోళన ఆదివారం నాటికి రైతు ఉద్యమం 127వ రోజుకు చేరుకుంది. ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతాలు సింఘూ, టిక్రీ, ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలు ఘాజీపూర్, పల్వాల్, హర్యానా-రాజస్థాన్ సరిహద్దు (జైపూర్ హైవే) ప్రాంతం షాజాహన్‌పూర్ వద్ద రైతులు ఆందోళన ఉధ తంగా సాగుతోంది. వేలాది మంది రైతులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉద్యమ కేంద్రాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. అలాగే పంజాబ్‌లో అబోహ కిసాన్ మహా పంచాయత్ జరిగింది. ఈసభలో రైతులు, వ్యవసాయ కార్మికులు మరీ ముఖ్యంగా మహిళా రైతులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కె ఎం) పిలుపులో భాగంగా నేడు (సోమవారం) దేశవ్యాప్తంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) కార్యాలయాల ఎదుట ఆందోళన చేయనున్నారు.