Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానికి ఏఐకేఎస్ నేతల లేఖ
న్యూఢిల్లీ : దేశంలోని ప్రజా పంపిణీ వ్యవస్థను రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి అఖిలభారత కిసాన్ సభ(ఏఐకేఎస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ ధావలే, హన్నన్ మొల్లా డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానికి హన్నన్ మొల్లా లేఖ రాశారు. ప్రజా పంపిణీ వ్యవస్థని దేశంలో బలహీన పర్చేందుకు మోడీ సర్కారు ఆధ్వర్యాన 2015లో శాంత కుమార్ కమిటీ నివేదికతో కుట్రలు బహిర్గతం అయ్యాయని వివరించారు. పీడీఎస్ లబ్దిదారులను గణనీయంగా తగ్గించాలని చెప్పినట్టు గుర్తు చేశారు. దేశంలో ఒకవైపు పేదరికంగా పెరిగిపోతుంటే ఆ విధంగా సిఫారసు ఇస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఆధీనం నుంచి వాటిని తొలగించడం సముచితం కాదన్నారు. డబ్ల్యూటీఓ, అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలైన ఒత్తిడితో నగదు బదిలీ వ్యవస్థను తీసుకువస్తున్నారని విమర్శించారు. పీడీఎస్ వ్యవస్థని పూర్తిగా ఎత్తివేసి, నగదు బదిలీ పథకం పెడితే దేశంలోని పేదలంతా ఆకలితో ఆలమటించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సరళీకృత విధానాల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 107 దేశాల్లో హంగర్ ఇండెక్స్‌లో ఇండియా 97వ స్థానంలో నిలిచినట్టు వివరించారు. అందుచేత, ఎఫ్‌సీఐని కేంద్ర ప్రభుత్వం రక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వపరంగా ఆ సంస్థని అన్నివిధాలుగా ఆదుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ఈ అంశంంపై దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు.