Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 871 పాయింట్ల పతనం..
ముంబయి : అంతర్జాతీయ ప్రతికూల సంతకేతాలకు తోడు, దేశంలో కరోనా వైరస్ విజంభణ, పలు ప్రాంతాల్లో మళ్లీ లాక్డౌన్ విధించడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ఒక్క పూటలోనే మదుపర్ల సంపద రూ.2.16 లక్షల కోట్లు హరించుకుపోయింది. సోమవారం సెషన్లో ఉదయమే ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు సమయం గడుస్తున్న కొద్దీ భారీ నష్టాల బాటపడ్డాయి. తుదకు బీఎస్ఈ సెన్సెక్స్ 870.51 పాయింట్లు లేదా 1.74 శాతం కోల్పోయి 49,159.32కు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 229.55 పాయింట్లు లేదా 1.54 శాతం పతనమై 14,637.80 వద్ద ముగిసింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.2,16,566 కోట్లు పతనమై 2.05 కోట్ల కోట్లకు పరిమితమైంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున పడిపోయాయి. రియాల్టీ, బ్యాంకింగ్, ఫినాన్స్, ఆటో రంగాలు 3.62 శాతం మేర కోల్పోయాయి. సెన్సెక్స్-30లో విప్రో, బ్రిటానియా, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగి యగా.. బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు అధికంగా నష్టాలు చవిచూస్తున్నాయి.