Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మానవాళిపై తన ప్రతాపాన్ని చూపుతున్న కరోనా మహమ్మారి ఇతర జీవజాలంపై కూడా పంజా విసురుతోంది. మనుషుల నుంచి పెంపుడు జంతువులతో పాటు పలు రకాల జీవులకు కోవిడ్-19 వ్యాపిస్తున్నది. పిల్లులు, కుక్కలు, సింహాలు, పులులు వంటి జీవులకు మనుషుల నుంచే కరోనా మహ మ్మారి సోకుతున్నదని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ధృవీకరిం చింది. కరోనా వైరస్ ఇప్పటివరకు మనుషుల నుంచి మనుషులకు తీవ్రంగా వ్యాపిస్తోంది. అయితే, మనుషుల నుంచి ఈ వైరస్ జంతువులకు సైతం వేగంగా వ్యాపిస్తున్నట్టుగా ఆధారాలు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఈ వివరా లను రష్యాకు చెందిన డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి మెలీటా ఉజ్నోవిక్ తాజాగా మీడి యాకు వెల్లడించారు. మింక్స్, కుక్కలు, పిల్లులు, సింహాలు, పులులు వంటివి వైరస్ సోకిన మనుషులకు సన్నిహితంగా ఉంటే అవి కూడా కరోనా బారినపడిన ట్టుగా తెలిందన్నారు. ఇతర జీవజాతులపై కరోనా ప్రభావం గురించి పరిశోధన లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ అధ్యయనం వైరస్ సోకిన జంతువుల నుంచి ఇతర జంతువుకు వైరస్ సోకకుండా తీసుకునే చర్యలకు ఉపయోగపడు తుంద న్నారు. ముఖ్యంగా కరోనా సోకినవారు తమ పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం మంచిదని మెలీటా పేర్కొన్నారు. కరోనా వైరస్ మనుషులు- జంతువు లు-మనుషులు ఇలా సర్కిల్‌గా వ్యాపిస్తే.. జన్యుమార్పులు చోటచేసుకుని తీవ్ర పరిణామాలకు దారీతీసే అవకాశముంటుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.