Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాఫెల్ ఒప్పందంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలి : సీపీఐ(ఎం)డిమాండ్
న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందంపై వెంటనే దర్యాప్తు జరగాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు కుదిరిన ఒప్పందంలో మధ్య దళారీకి పది లక్షల యూరోలు ముడుపులుగా చెల్లించారని ఫ్రెంచి మీడియా పోర్టల్ తాజాగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో ముడుపులు, అక్రమ చెల్లింపులు జరిగాయన్న అంశం మరోసారి తెరపైకి వచ్చిందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. 2017నాటి దస్సాల్ట్ కంపెనీ ఖాతాలపై జరిగిన విచార ణను ఆధారం చేసుకుని ఫ్రెంచి మీడియా పోర్టల్ నివేదిక వెలువరిం చింది. అయితే రాఫెల్ ఒప్పందంపై దర్యాప్తునకు ఆదేశించడానికి మోడీ ప్రభుత్వం తిరస్కరించడం చూస్తుంటే ఇందులో ఏదో దాచాల్సి న విషయం వున్నదన్న అనుమానాలు తలెత్తుతున్నాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది. అక్రమ చెల్లింపుల అంశంపై కాగ్ ఆడిట్ నివేదిక పరిశీలించలేదు. రాఫెల్ యుద్ధ విమానాల కోసం గతంలో కుదిరిన ఒప్పందం రద్దు చేసి అంతకంటే అధిక వ్యయంతో 36 విమానాల కోసం తాజాగా ఆర్డర్ పెట్టడంపై ఉన్నత స్థాయి దర్యాప్తు సాగాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.