Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆర్బిఐ వరుసగా ఐదో సారి సమీక్ష లోనూ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ప్రకటిం చింది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుం డటం, ద్రవ్యోల్బణ కట్టడి నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వేచి చూసే దోరణీతో ఈ నిర్ణయం తీసుకుంది. గవర్నర్ శక్తికాంత్ దాస్ అధ్యక్ష తన మూడు రోజుల పాటు సాగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ బుధవారంతో ముగిసింది. సమావేశ నిర్ణయాలను దాస్ మీడి యాకు వెల్లడించారు. కరోనా మళ్లీ విజంభణతో దేశీ య ఆర్థిక ప్రగతి అస్థిరంగా మారిందన్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేయడం వల్ల వృద్ధి పునరుత్తేజంపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. మార్కెట్లకు కావాల్సినంత ద్రవ్యా న్ని అందించనున్నట్లు దాస్ వెల్లడించారు. ద్రవ్యపర పతి విధానంలో భాగంగా తాజా రుణాల కోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో నాబార్డ్, ఎన్హెచ్ బీ, ఎస్ఐడీబీఐలకు రూ.50,000 కోట్లు అదనపు నగదు లభ్యత సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపింది. రాష్ట్రాలకు ఇచ్చే చేబదుళ్ల ('వేస్ అండ్ మీన్స్) పరి మితిని రూ.47,010 కోట్లకు పెంచినట్టు వెల్లడిం చింది. దేశీయ ఆర్థిక సంస్థలపై అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు ప్రభావం నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకుంటు న్నామన్నారు.