Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని ఫ్రెంచ్ అధికారులు.. ప్రశ్నించిన మీడియా నివేదిక
న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం చోటు చేసుకుందన్న అనుమానాలపై దర్యాప్తు చేయడానికి ఫ్రెంచి అవినీతి నిరోధక అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేయడం లేదని
ఫ్రెంచి మీడియా పేర్కొంది. ఈ ఒప్పందం వెనుక గల అవినీతి సాక్ష్యాధారాలపై దర్యాప్తులను అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్‌కి చెందిన ఆర్థిక నేరాల విభాగం (పీఎన్ఎఫ్) అధిపతి ఇలియాన్ హ్యూలెట్ ఎలా నిలిపివేశారో ఫ్రెంచి మీడియా పోర్టల్ తన నివేదికలో వివరించింది. తన సహచరుల అభిప్రాయానికి విరుద్ధంగా ఆమె ఈ చర్య తీసుకున్నారు. ఈ కేసులో అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలాండ్‌లు కూడా ఆరోపణలు చేశారు. మీడియాపార్ట్కి అందిన డాక్యుమెంట్లు, ప్రాధమిక సమాచారాన్ని బట్టి పిఎన్ఎఫ్ చీఫ్ ఇలియానె దర్యాప్తును తీవ్రంగా చేపట్ట లేదని తెలుస్తోంది. అయితే డాసాల్ట్ తరపు లాయర్‌తో ఆమె లాంఛనప్రాయంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారుని మీడియా పార్ట్ నివేదిక తెలిపింది. ఈ ఒప్పందం చుట్టూ అనేక అనుమానాలు నెలకొన్నాయని, అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలు వున్నాయని, మనీ లాండరింగ్ జరిగిందని, ఆశ్రిత పక్షపాతం వుందని ఫ్రాన్స్ ఎన్జిఓ అయిన షెర్పా పేర్కొంది. ఫ్రాన్స్ ప్రయోజనాలు, సంస్థల పనితీరును పరిరక్షించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె సమర్ధించుకున్నారని ఆ నివేదిక పేర్కొంది. 2019 జూన్‌లో పిఎన్ఎఫ్ అధినేతగా తన పదవిని వీడడానికి ముందుగా షెర్పా ఫిర్యాదుపై ప్రాధమిక దర్యాప్తును మూసివేయాలని ఇలియానె నిర్ణయించారు. ఈ కేసులో ఇన్చార్జి డిప్యూటీ ప్రాసిక్యూటర్ సలహాకు విరుద్ధంగా ఎలాంటి నేరం జరగలేదని ఆమె పేర్కొన్నారు. దర్యాప్తు నుండి వైదొలగుతున్నామని అధికారిక నోటిఫికేషన్‌ను రాతపూర్వకంగా ఇవ్వడానికి ఆ డిప్యూటీ ప్రాసిక్యూటర్ తిరస్కరించారు. అయితే ఇలియానె తీసుక్ను నిర్ణయాన్ని ఎట్టకేలకు పారిస్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్‌కి చెందిన ఇద్దరు మేజిస్ట్రేట్లు ధృవీకరించారు. ఆమె స్థానంలో పిఎన్ఎఫ్ చీఫ్‌గా వచ్చిన జేన్ ఫ్రాంకోయిస్ బానెర్ట్ సమర్ధించారని నివేదిక తెలిపింది.
ఈ ఒప్పందంపై సమాంతరంగా చర్చలు జరిగాయని, వాటికి ప్రధానమంత్రి కార్యాలయం నేతృత్వం వహించిందని పేర్కొంటూ భారతదేశ దినపత్రిక హిందూ రహస్య పత్రాలను ప్రచురించిందని ఆ నివేదిక తెలిపింది. పైగా ఈ ఒప్పందంలో ఒక్కో విమానం ఖరీదు అపారంగా పెరిగిపోవడాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. తమపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, తప్పుదారి పట్టించేలా మీడియాలోకి కొన్ని వర్గాలు యత్నిస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న డిఫైస్ సొల్యూషన్స్ పేర్కొంది.