Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు
- పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ
- యూపీలో రెండు డోసులు తీసుకున్న 40 మంది డాక్టర్లకు కరోనా
- మహారాష్ట్రలో మందుల కొరత !
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇదివరకు ఎప్పుడులేని రీతిలో నిత్యం కొత్త కేసులు నమోదవు తున్నాయి. ఒకేరోజు లక్ష మందికి పైగా వైరస్ బారినపడటం, మరణాలు సైతం క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,15,736 మందికి కరోనా సోకింది. రోజువారీ కేసులు ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే మొదటిసారి. అలాగే, కొత్తగా 630 మంది మరణించారు.