Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లో దారుణాలు ఆగటంలేదు. గతంలో కధువాలో చిన్నారిపై అఘాయిత్యం ఘటన ఎంతగా వివాదమైందో.. అప్పటినుంచి అక్కడ ఎవరికీ రక్షణలేదనేలా దారుణాలు జరుగుతు న్నాయి. తాజాగా ప్రజలమానప్రాణాలను రక్షించాల్సిన పోలీసే ఆ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆయనతో సహ నలుగురు బాలికపై సామూహిక లైంగికదాడికి దిగారు. అయితే వైద్యపరీక్షల్లో బాలిక గర్భవతి అని తేలడంతో నిజం బయటపడింది. ఆ నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్గాం జిల్లాలోని బొనిగమ్ ఖాజీగుండ్ లో ఒక మహిళ సహాయంతో పోలీసులు ఆ నలు గురి నిందితులను అరెస్టు చేశారు. డమ్జేన్ ప్రాంతంలో తన కూతురిపై లైంగికదాడి జరిగిందంటూ బాలిక తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు పోలీ సులు వారిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించారు. అయితే, బాలికపై దారుణానికి తెగబడిన నిందితుల్లో ఒకరైన పోలీసు.. ఆ సమయంలో విధుల్లో లేరని అధికారులు తెలిపారు. ఆయనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌తో పాటు శాఖాపరమైన చర్యలు ప్రారంభమైనట్టు వివరించారు. వ్యక్తి హౌదాతో సంబంధం లేకుండా నేరస్థులపై కుల్గాం పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు.