Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులకి కేంద్ర ప్రభుత్వం సంఖ్య ఇచ్చి గుర్తించింది. మహబూబ్‌నగర్- కొడంగల్-తాండూరుల మీదుగా కర్నాటకలోని చించోరి వద్ద ఎన్‌హెచ్ 65ను అనుసంధానిస్తూ ఈ రహదారిను నూతనంగా ఎన్‌హెచ్ 167ఎన్ గా మార్చింది. అంతేగాక కొత్తగూడెం-ఇల్లెందు-మహబూబాబాద్-నెల్లికుదురు-తొర్రూరు-వలిగొండల మీదుగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని గౌరెల్లి జంక్షన్‌కు అనుసంధానిస్తూ ఎన్‌హెచ్ 930పీ గా గుర్తించినట్టు కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.