Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానాలో ఘటన
చండీగఢ్ : వివాదాస్పద సాగు చట్టాలపై నిరసన చేస్తున్న రైతులకు మద్దతుగా ఒక టీచర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చట్టాలు రద్దు చేయాలని కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న రైతుల డిమాండ్లకు పరిష్కారం లభించకపోవడంతో విషం తాగి ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హర్యానాలోని రోహతక్‌లో చోటు చేసుకున్నది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముఖేశ్ ఒక టీచర్. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్న రైతులకు ఆయన మద్దతుగా నిలిచాడు. పలు సందర్భాల్లో ఢిల్లీ సరిహద్దుల్లోని రైతుల నిరసన ప్రాంతాలను సందర్శించాడు. అయితే, కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో ఇన్ని నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులకు పరిష్కారం లభించడలేదని ముఖేశ్ ఆవేదన చెందారు. దీంతో కేంద్రం తీరుపై విసుగెత్తిన ముఖేశ్ ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. దీనికి సంబంధించి ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ముఖేశ్ ఆత్మహత్య గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. కానీ, అప్పటికే ముఖేశ్ విషం తాగాడు. అయితే, ముఖేశ్‌ను ఆస్పత్రికి తరలించామనీ, ఆయన అప్పటికే మృతి చెందాడని రోహతక్ డీఎస్పీ గోరఖ్‌పాల్ వెల్లడించారు.