Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సీబీఎస్ఇ 10, 12 తరగతి వార్షిక పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా నిర్వహిస్తామని, కరోనా మార్గదర్శకాలను పాటిస్తామని సీబీఎస్ఇ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సెక్రటరీ గెర్రీ అరాథూన్ తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మే నెలలో జరగబోయే బోర్డు పరీక్షల్ని రద్దు చేయాలని, లేదా వాటిని ఆన్లైన్లో నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇందుకోసం ఆన్లైన్ పిటిషిన్పై లక్ష మందికిపైగా విద్యార్థులు సంతకాలు చేశారు. రెండు రోజులుగా షaఅషవశ్రీbశీaతీసవఞaఎర 2021 హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. 'దేశంలో తక్కువ కేసులు ఉన్నప్పుడే గతేడాది వార్షిక పరీక్షల్ని రద్దు చేశారు. ఇప్పుడు కేసులు భారీగా పెరుగుతుంటే.. పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నారు. గతేడాదిలాగే పరీక్షల్ని రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖా మంత్రిని కోరుతున్నాం.' అని మరో పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై స్పందించిన సీబీఎస్ఇ అధికారి ఒకరు.. విద్యార్థుల భద్రత కోసం పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాల్ని కూడా 40 నుంచి 50 శాతం వరకు పెంచామని, నిబంధనలు పాటించేలా సిబ్బందికి ప్రత్యేకంగా సూచనలిస్తున్నామని పేర్కొన్నారు.