Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా దేశంలో సెకండ్‌వేవ్ మొదలైనప్పటి నుంచి చిన్నారులపై కోవిడ్-19 పంజా విసురుతోంది. ఒక్క మార్చి నెలలోనే 79 వేల మంది చిన్నారుకు కరోనా సోకింది. ఇప్పటివరకు ప్రభుత్వం వెల్లడించిన కరోనా గణాంకాలను గమనిస్తే.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఈ ఐదు రాష్ట్రాల్లో మార్చి 1 నుంచి ఏప్రిల్ 4 మధ్య కాలంలో అధిక సంఖ్యలో చిన్నారులు కరోనా బారినపడ్డారు. మార్చినెలలో 79,688 మంది చిన్నారులు కరోనా బారినపడ్డారు. అత్యధికంగా మహారాష్ట్రలో ఈ ఒక్క నెలలోనే 60,684 మంది పిల్లలకు కరోనా సోకింది. వీరిలో 9,882 మంది చిన్నారులు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 5,940 మంది పిల్లలు కోవిడ్-19 బారినపడగా, వీరిలో 922 మంది ఐదేండ్ల లోపువారున్నారు. కర్నాటకలో 7,327 మంది చిన్నారులకు కరోనా సోకగా, అందులో ఐదేండ్ల లోపు వారు 871 మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో కరోనా బారినపడ్డ 3,004 మంది చిన్నారుల్లో 471 మంది ఐదేండ్లలోపు పిల్లలు ఉన్నారు. దేశరాజధాని ఢిల్లీలో 2,733 మంది చిన్నారులకు కరోనా సోకగా, వీరిలో ఐదేండ్లలోపు వారు 441 మంది ఉన్నారు.