Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంటలకు సోకే రోగాలను నిమిషాల వ్యవధిలో కనిపెట్టే మరమనిషి
- పోషకాల స్థాయి, ఎదుగుదల లోపాలను కూడా చెప్పే సాంకేతికత
- పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు తీర్చేందుకు సరైన మార్గం
స్రవంతి
2050 నాటికి ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తులను అదే స్థాయిలో పెంచ్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గడిచిన కొన్ని దశాబ్దాల కాలంలో సాంకేతిక విప్లవం కారణంగా వినూత్నమైన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో, వ్యవసాయంలో యాంత్రీకరణ కారణంగా దిగుబడి బాగా పెరిగింది. అయితే, మొక్కల పోషణ, చీడపీడలు, ఎదుగుదల, సరైన సమయంలో పంటకు వేయాల్సిన మందులు తదితర అంశాలపై రైతులకు సరైన సమాచారం, అవగాహన లేకపోవడంతో ఇప్పటికీ దాదాపు 30 శాతం పంట వ్యర్థం అవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు సింగపూర్ శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో ఓ రోబో వ్యవసాయ డాక్టర్ ను కనిపెట్టారు. అదే 'ప్లాంట్-రోబో'
ఎలా పనిచేస్తుంది?
ఎదుగుదల, పోషణ వంటి కృత్యాలను తెలియజేయ డానికి మొక్కలు సహజంగా ఒకరకమైన ఎలక్ట్రికల్ పల్స్ విడుదల చేస్తాయి. ఈ పల్స్ ను విశ్లేషిస్తే మొక్కకు చీడపీడ తగిలిందా? పోషణలో ఏమైనా సమస్య ఉందా? తదితర విషయాలను తెలుసుకోవచ్చు. మొక్కలు విడుదల చేసే ఈ సిగళ్లను అంచనా వేయడానికి 'ప్లాంట్-రోబో' వ్యవస్థలో ఎలక్రోడ్లు ఉంటాయి. వీటిని మొక్క ఆకు పైభాగానికి అనుసంధానిస్తారు. దీంతో మొక్కలకు అందుతున్న పోష కాల స్థాయి, రోగాలు, ఎదుగుదలలో లోపాలు వంటి అంశా లను నిమిషాల వ్యవధిలో తెలుసుకొని పరిష్కారాన్ని కను గోవచ్చు. వందల ఎకరాల పొలంలోని అన్ని మొక్కలపై ఇలా పరిశోధన చేయడం కష్టంతో కూడుకున్న పని. కాబట్టి, నమూనా రూపంలో ఒకటి, రెండు మొక్కలపై ఈ విశ్లేషణ లు చేసి.. ఆ ఫలితాలను కృత్రిమ మేధ సాయంతో విశ్లేషిస్తే, పంటల నాశనాన్ని అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నా రు. ప్రాథమిక దశలో ఉన్న ఈ 'ప్లాంట్-రోబో' అందుబాటు లోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. ఇంట్లో ఉండి స్మార్ట్ ఫోన్ సాయంతో ఈ రోబోకు రైతులు ఆదేశాలు కూడా ఇవ్వొచ్చని తెలిపారు.