Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కతా : పశ్చిమబెంగాల్లో మొత్తం ఎనిమిది దశల పోలింగ్‌కుగాను ఇప్పటివరకు మూడు దశల పోలింగ్ పూర్తయింది. మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో వామపక్షాల ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది. భారీ ర్యాలీలు, సభలు, ఇంటింటి ప్రచారంతో లెఫ్ట్‌ఫ్రంట్ నేతలు, కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు. బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలో బుధవారం సాయంత్రం భారీ ర్యాలీ జరిగింది. సంయుక్త మోర్చా అభ్యర్థులకు మద్దతుగా నగరంలోని దకురియా నుంచి భగజతిన్ ప్రాంతం వరకు జరిగిన ఈ ర్యాలీలో లెఫ్ట్‌ఫ్రంట్ చైర్మెన్, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బిమన్ బసు, కేంద్ర కమిటీ సభ్యులు రణిబ్ దేవ్, తదితరులు పాల్గొన్నారు. సిలిగురి నియోజకవర్గంలోని భాగజతిన్ ఏరియాలో సీపీఐ(ఎం) అభ్యర్థి అశోక్ భట్టాచార్యకు మద్దతుగా నిర్వహించిన ప్రచారానికి స్థానికుల నుంచి భారీ స్పందన లభించింది. కూచ్‌బెహర్ జిల్లాలోని సితల్కుచి నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి సుధాంగ్షు ప్రమాణిక్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. లబ్పూర్ పరిధిలోని పలు పంచాయతీల్లో సయ్యద్ కరీం ప్రచారం చేపట్టారు. బెలి, నైహతి, నతబరి, ట్యాలిఘంజ్, సోనార్పూర్, తదితర నియోజకవర్గాల్లో వామపక్షాలు విస్తృతంగా ప్రచారం చేశాయి. హౌరా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్, మాజీ ముఖ్యమంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్, దీప్సితాధర్ బుధవారం సంయుక్త మోర్చా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. పశ్చిమబెంగాల్లో మహిళలకు భద్రత అతి పెద్ద సమస్యగా ఉందని, గత కొన్నేండ్లుగా వారిపై అఘాయి త్యాలు పెరిగిపోయాయని బృందాకరత్ విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కరోనా వైరస్‌కంటే ప్రమాదకరమని అన్నారు. మాణిక్ సర్కార్ మాట్లాడుతూ బీజేపీ, టీఎంసీలు రెండూ బీజేపీకి సంబంధించిన డబుల్ ఇంజన్లని, వారి మాటలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.