Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కరోజే 1.26 లక్షల కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకూ తన ప్రభావాన్ని పెంచుకుంటుండటంలో నిత్యం రికార్డు స్థాయింలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా రోజు లక్షకు పైగా కొత్త కేసులు నమోదుకావడం వైరస్ విజృంభణకు అద్దం పడుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,26,789 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వెలుగుచూసినప్పటి నుంచి ఒకేరోజు ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. అలాగే, 685 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనాకేసుల సంఖ్య 1,29,28,574 చేరగా, మరణాల సంఖ్య 1,66, 862కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 9,10,319 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 59,258 మంది కోలుకోవడంతో ఆ సంఖ్య 1,18,51,393కు చేరింది.