Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: హోమియోపతి పితామహుడు డాక్టర్ శామ్యూల్ హేన్మన్ జయంతి వేడుకలు పురస్కరించుకుని డాక్టర్ బత్రాస్ తమ క్లిని క్‌ల్లో ఉచిత కన్సల్టేషన్‌ను కల్పిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 10 నుంచి 22వ తేది వరకు రోగులందరికీ ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొంది. డాక్టర్ బాత్రాస్ గ్రూప్ కంపెనీల వ్యవస్థాపకులు డాక్టర్ ముకేష్ బాత్రా రాసిన 'హీలింగ్ పీపుల్, ఛేంజింగ్ లైవ్స్' పుస్తకాన్ని ఆన్లైన్లో బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్, ఆయుష్ టాస్క్‌ఫోర్స్ చైర్మెన్ శ్రీ శరద్ మరాఠీ ఆవిష్కరించారు. ఇందులో 100కు పైగా రోగుల కథలను ప్రత్యే కంగా అందించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ ఏడాది దాదాపు 50వేల మంది నిరుపేదలకు ఉచితంగా చికిత్సలను అందించనున్నామని ముకేష్ బాత్రా తెలిపారు.