Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్యాన్వాపి మసీదు సర్వేపై సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న గ్యాన్వాపి మసీదు ఉన్న స్థలంలో ఒకప్పుడు ఆలయం ఉందా లేదా అన్నదానిపై సర్వే చేయాలని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఎఎస్ఐ)ను స్థానిక సివిల్ కోర్టు ఆదేశించడంపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు 'ఆరాధన స్థలాల(ప్రత్యేక నిబంధనలు) చట్టం'ను పూర్తిగా ఉల్లంఘించేవిగా ఉన్నాయని పేర్కొంది. మతపరమైన ఆరాధన స్థలాల విషయంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితినే యథాతథంగానే (స్టేటస్కో) ఉంచాలని ఈ చట్టం చెబుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసేలా ఉన్నత న్యాయవ్యవస్థ వెంటనే జోక్యం చేసుకోవాలని పొలిట్‌బ్యూరో కోరింది.