Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎస్ వాతావరణ రాయబారి జాన్ కెర్రి
న్యూఢిల్లీ : భారతీయ పర్యావరణ కార్యకర్త దిశా రవి ప్రదర్శించిన యాక్టివిజం తీరును తాను వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నట్టు యూఎస్ వాతావరణ రాయబారి జాన్ కెర్రీ అన్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆయన భారత్కు వచ్చారు. ప్రధాని మోడీతో సమావేశమై వాతారణ సంబంధ అంశాలపై చర్చించారు. ఈ పర్యటనలో భాగంగానే దిశ రవిని అభినందిస్తూ ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, వివాదాస్పద సాగు చట్టాలపై దేశంలో రైతుల ఉద్యమం జరుగుతున్న తరుణంలో 'టూల్ కిట్'ను తయారు చేశారన్న నెపంతో దేశద్రోహం చట్టం కింద ఆమె అరెస్టయిన విషయం విదితమే. అమెరికాలో మానవ హక్కులు ఎల్లప్పుడూ ఒక తీవ్ర సమస్యనే అని జాన్ కెర్రీ ఈ సందర్భంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. పెద్దలు తాము ఏం చేయగలరో వారిని అటువైపు మళ్లించడంలో యువ పర్యావరణవేత్తల పాత్ర కీలకమని ఆయన చెప్పారు.