Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారతీయుల్ని వివాహం చేసుకుని, విడాకులు ఇచ్చిన తరువాత విదేశీయులకు ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) హోదా ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టుకు ఈ మేరకు కేంద్ర హోం శాఖ వివరణ ఇచ్చింది. భారతీయుల్ని పెండ్లి చేసుకున్నందుకే విదేశీయులకు ఓసీఐ హోదా లభిస్తుందని స్పష్టం చేసింది. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే బెల్జియంకు చెందిన ఒక మహిళ 2006లో ఒక భారతీయుడ్ని వివాహం చేసుకుంది. 2011లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. దీంతో విడాకుల తరువాత తనకు మంజూరైన కార్డును మహిళ తిరిగి ఇవ్వాల్సిందేనని హోం శాఖ తెలిపింది. ఇలాంటి విదేశీయులు భారత్లో చట్ట ప్రకారం నివసించాలనుకుంటే ప్రస్తుత ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందేనని హోం శాఖ స్పష్టం చేసింది.