Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పాత గెలాక్సీ స్మార్ట్ ఫోన్లను కంటి వ్యాధుల్ని పరీక్షించే వైద్య పరికరాలుగా తయారు చేశామని సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ వెల్లడించింది. ఇందుకోసం కొరి యాలో ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్ నెస్ (ఐఏపీబీ), యోన్ సి యూనివర్శిటీ హెల్త్ సిస్టం (వైయూహెచ్ఎస్)తో తమ సంస్థ భాగస్వామం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. వియత్నాం, భారతదేశం, మోరాకో, పపువ న్యూ గినియాలలో దృష్టి లోపం గల వారికి వ్యాధి నిర్థారణ చేయడానికి ఇవి దోహదం చేస్తాయని తెలిపింది.