Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమలుకు పంజాబ్ సర్కారు ఆమోదం
చండీగఢ్ : పంజాబ్‌లో రైతులు తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే బదిలీ చేయనున్నారు. ఇప్పటి వరకు ఇది కమీషన్ ఏజెంట్ల ద్వారా జరిగేది. అయితే, కేంద్రం సూచన మేరకు పంజాబ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు పంజాబ్ ప్రభుత్వం గురువారం ఆమోదం తెలిపింది. రబీ మార్కెటింగ్ సీజన్ ప్రారంభమయ్యే తరుణంలో నేటి నుంచి (శనివారం నుంచి) రైతులకు నేరుగా ఆన్లైన్ చెల్లింపులు జరగనున్నాయి. సాధారణంగా కేంద్రం తరఫున పంజాబ్.. రైతుల నుంచి కనీస మద్దతు ధరతో గోధుమ, వరిని కొనుగోలు చేస్తుంది. కమీషన్ ఏజెంట్ల (అర్తిదారులు) ద్వారా రైతులకు ఎంఎస్పీ చెల్లింపులు జరిగేవి. కాగా, నేరుగా బ్యాంకు ఖాతాలకు ఎంఎస్పీ బదిలీ విషయంపై కేంద్ర మంత్రి పీయూశ్ గోయెల్‌ను పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ కలిసి గురువారం చర్చించారు. డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ (డీబీటీ)ను అమలు చేయాలంటూ కేంద్రం మమ్మల్ని (పంజాబ్ ప్రభుత్వం) అడిగిందని సమావేశం అనంతరం మన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. '' రాష్ట్రంలో ఎంతోకాలం నుంచి సాంప్రదాయంగా వస్తున్న అర్తి వ్యవస్థ ఉన్నందున కేంద్రాన్ని మేము కొంత సమయాన్ని కోరాం. కానీ, కేంద్రం మా డిమాండ్‌ను పట్టించుకోలేదు. ఎంతగా ప్రయత్నించినప్పటికీ కేంద్రం మా మాట వినలేదు'' అని మంత్రి చెప్పారు.