Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన ఉన్నావో లైంగికదాడి కేసులో దోషి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ భార్యకు ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చింది. పంజాయతీ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో కుల్దీప్ సింగ్ భార్య సంగీతా సెంగార్ పేరు చేర్చటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెకు ఫతేపూర్ చౌరాసి ట్రిటాయా జిల్లా పంచాయతీ సభ్యురాలిగా బీజేపీ టిక్కెట్ కేటాయించింది. 2016లో ఉన్నావో జిల్లా పంచాయత్ చైర్మెన్‌గా సంగీతా ఎన్నికయ్యారు. అప్పుడు రాజకీయ పార్టీ గుర్తుపై పంచాయతీ ఎన్నికలు జరగలేదు. కానీ, ఈసారి బీజేపీ సహా రాజకీయ పార్టీలన్నీ తమ తమ అభ్యర్థులను బహిరంగంగానే ప్రకటించాయి. కుల్దీప్ సింగ్ రాజీనామా చేసిన ఉన్నావో జిల్లా బంగర్మౌ అసెంబ్లీకి 2017లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్ కటియార్‌కు సంగీత బహిరంగంగా ప్రచారం చేశారు. ఈసారి బీజేపీ నాయకులు సంగీతా సెంగార్‌కు ప్రచారం చేయనున్నారు. ఓ మైనర్ బాలికపై లైంగికదాడి చేసిన కేసులో కుల్దీప్ సింగ్ సెంగార్ దోషిగా తేలడంతో 2019 డిసెంబర్ 20న ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. కుల్దీప్ సింగ్‌పై న్యాయపోరాటానికి దిగిన బాధితురాలు తండ్రి సహా సమీప బంధువులను పోగొట్టుకున్నది. అంతేకాదు ఆమెను హత్య చేసేందుకు కూడా బీజేపీ మాజీ ఎమ్మెల్యే వెనుకాడలేదు. ప్రాణాలకు తెగించి మరీ పోరాడిన బాధితురాలు న్యాయ పోరాటంలో చివరకు విజయం సాధించింది. బీజేపీ ఎమ్మెల్యేకు యావజ్జీవం పడింది. కాగా, సంగీతకు టికెట్ ఇవ్వడంపై యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ సమర్థించుకున్నారు. ప్రస్తుతం ఉన్నావ్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఆమె పనిచేస్తున్నారనీ, ఇలాంటి సమయంలో సంగీతకు ప్రజాదరణ ఉందోలేదో చూడాలని శుక్లా హితవు పలికారు.