Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు పేషెంట్లు మృతి
నాగ్‌పూర్: నాగ్‌పూర్‌లోని వెల్‌ట్రీట్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరగటంతో.. చికిత్స పొందుతున్న నలుగురు పేషెంట్లు సజీవదహనమ య్యారు. రెండోఅంతస్థులో ఉన్న ఐసీయూలోని ఏసీయూనిట్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వాడి ప్రాంతంలో ఉన్న అగ్నిమాపకసిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిమాపకశకటాలు రంగంలోకి దిగి పలువురు రోగుల్ని,సిబ్బందిని రక్షించారు. నలుగురు పేషెంట్లు మాత్రం ఆమంటల్లోనే సజీవదహమయ్యారని నాగ్‌పూర్ పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తుచేస్తున్నట్టు పోలీసు, అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. కాగా కోవిడ్ పేషెంట్లు ఉన్న ఆస్పత్రుల్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చికిత్సకోసం చేరిన రోగుల ప్రాణాలు గాల్లోకలుస్తున్నాయి. కానీ వీటిపై కఠినచర్యలు తీసుకోవటంలేదని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.