Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్‌తో గంటల వ్యవధిలోనే 40కిపైగా శవాలు
- గుజరాత్లో కర్మకాండలకూ కష్టం
సూరత్: ప్రధాని మోడీ సొంతరాష్ట్రమైన గుజరాత్లో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. కోవిడ్-19తో సూరత్ శవాలగుట్టగా మారుతున్న దన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇక మరణించిన కరోనా రోగులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వెయిటింగ్ తప్పటంలేదు. గురువారం సూరత్‌లోని శ్మశానవాటికలో కొద్దిగంటల్లోనే సుమారు 40 శవాలను తీసుకొచ్చారు. 15 నిమిషాల్లో మూడు అంబులెన్సులలో తొమ్మిదిశవాలను తరలించారు. మరో అంబులెన్స్‌లో ఆరు మృతదేహాలను తరలించారు. ఒకేసారి ఎక్కువసంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతుంటే.. ఆ పార్ధీవదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాలంటే కనీసం మూడు నుంచి నాలుగుగంటలవరకు ఎదురుచూడక తప్పటంలేదని బంధువులు అంటున్నారు. సర్కారు లెక్కల్లో మాత్రం 5 నుంచి 10లోపే మరణాలు...రోజూ వందకుపైగా అంత్యక్రియలుబీజేపీ ప్రభుత్వ లెక్కలప్రకారం... సూరత్‌లో రోజుకు కరోనాతో 5 నుంచి 8 మరణాలు నమోదవుతున్నాయి. వాస్తవంగా.. రోజూ 100కు పైగా మృతదేహాలను దహనం చేస్తున్నారు. దీంతో శ్మశానవాటికల్లో గందరగోళపరిస్థితులు నెలకొం టున్నాయి. ఇక్కడ ఉన్న మూడు నుంచి నాలుగు అంబులెన్స్‌లు రోజూ మూడు నుంచి నాలుగు ట్రిప్పులు వేస్తున్నాయి. ఇక ఒకే అంబులెన్స్‌లో ఆరు మృతదేహాలను శ్మశానవాటికకు తరలించారు. వారిలో చనిపోయిన తమ బంధువు శరీరం ఏదో తెలియటానికి నానా అవస్థలు పడుతున్నారు. తీరా ఆ మృతదేహాన్ని గుర్తించాక.. దహనం చేయటానికి తనకూ కష్టమవుతున్నదని కాటికాపరి తెలిపాడు. అంత్యక్రియలు నిర్వహించటానికి భారీసంఖ్యలో బంధువులు తరలివస్తున్నారు. దీంతో కరోనా వ్యాధి ఎక్కడసోకుతున్నదోనన్న భయం పలువురిని వెంటాడుతున్నది. కాగా గుజరాత్లో గత 24 గంటల్లో నాలుగు వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.