Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాఖకు తరలింపుపై సర్కార్ అభిప్రాయ సేకరణ
అమరావతి: పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం కు ఎప్పుడు తరలివెళ్లాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల అభిప్రాయాలు సేకరిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సచివాలయంలో విభాగాల వారిగా సిబ్బందితో చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు విశాఖలో అభివృద్ధి తదితర అంశాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వారం, వారం సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం కోర్టు ముందు ఉండటంతో తీర్పు ఎప్పుడు వచ్చినా, ఆ తరువాత వారం లోపే వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్న సంకేతాలు ఇప్పటికే పై నుండి అందినట్టు చెబుతున్నారు. అవసరమైతే కోర్టు ఆదేశాలు వచ్చిన తరువాత రెండు రోజుల్లోనే విశాఖ నుండి పాలన ప్రారంభించాలని కూడా చెప్పినట్టు సమాచారం. దీనికి అనుగుణంగా విభాగాల వారీగా అధికారుల, ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అభిప్రాయాలు చెప్పినవారిలో ఎక్కువమంది ఏప్రిల్, మే మొదటివారంలో అయితే సిద్ధంగా ఉన్నామని తెలిపినట్టు సమాచారం. ఆ తరవాత పిల్లల చదువుకు ఇబ్బందులు ఎదురవుతాయని ఎక్కువమంది చెప్పినట్టు తెలిసింది.