Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: క్షయ నిర్మూలనకు కృషి చేసినందుకుగానూ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ సత్కారించారు. రెండు దశాబ్దాలుగా క్షయ వ్యాధిని నిర్మూలించడానికి కృషి చేస్తున్న చెన్నైకి చెందిన స్వచ్ఛంద సంస్థ 'రీచ్' తాజాగా ఓ వర్చువల్ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనిలో భాగంగా శాస్త్రవేత్త స్వామినాథన్‌ను సత్కరించారు. 1998లో సంస్థ ప్రారంభమైనప్పటి టీబీ నిర్మూలన, దీని విధానాన్ని ప్రజల్లో తీసు కళ్లడానికి ఆయన ఎంతగానే కృషి చేశారని రీచ్ పేర్కొంది. కాగా, ఈ కార్య క్రమంలో స్వామినాథన్ మాట్లాడుతూ.. టీబీ సమస్యను పరిష్కారానికి సంబంధించి మూడు అంశాలను గురించి ప్రస్తావించారు. అందులో మొదటిది టీబీని గుర్తించడం, తరువాత సమస్య స్వభావాన్ని అర్థం చేసుకోవడం, టీబీ నిర్మూలన ఉమ్మడి లక్ష్యం దిశగా కలిసి పనిచేయడానికి ప్రజలను సమీకరించడం, చర్యలు తీసుకోవడం అంశాలు ఉన్నాయి.