Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెహికల్ స్క్రాపేజ్ పాలసీ..ఆటోమొబైల్ తయారీ కంపెనీలకు ప్రయోజనం
- కొత్త విధానంపై ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్లు ఆందోళన
- ఇది అమల్లోకి వస్తే 80శాతం వాహనాలు మూలనపడతాయి
- మొత్తం వాహనరంగమే కుదేలవుతుంది : ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దేశంలో 20ఏండ్లు దాటిన 51లక్షల లైట్ మోటార్ వెహికల్స్, మరో 34లక్షల వాహనాలు 15 ఏండ్లు దాటినవి ఉన్నాయి. 17లక్షల మీడియం, హెవీ కమర్షియల్ వాహనాలు 15ఏండ్లు దాటినవి ఉన్నాయి. కేంద్రం కొత్త విధానం వల్ల ఇవన్నీ మూలనపడే పరిస్థితి నెలకొంటుంది. వీటిపై ఆధారపడి బతుకుతున్న డ్రైవర్లు, ఇతర కార్మికులకు ఉపాధిలేకుండాపోయే ప్రమాదముంది.
న్యూఢిల్లీ: వాణిజ్య వాహనాలు, వ్యక్తిగత వాహనాలపై మోడీ సర్కార్ సిద్ధం చేసిన 'వెహికల్ స్క్రాపేజ్ పాలసీ'పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 15 ఏండ్లుదాటిన వాణిజ్య వాహనాలు, 20ఏండ్లు దాటిని వ్యక్తిగత వాహనాలు రోడ్డుమీదకు రాకుండా నిషేధించే ఆలోచనలో కేంద్రం ఉందన్నది తెలిసిందే. దీనికి సంబంధించిన విధివిధానాల్ని కేంద్రం దాదాపు సిద్ధం చేసింది. ఈ పాలసీగనుక అమల్లోకి వస్తే మొత్తం వాహనాల్లో 80శాతం తుక్కుకింద అమ్ము కోవాల్సిందేనని, తమ వ్యాపారాలన్నీ మూత పడ తాయని 'ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్క్స్ ఫెడరేషన్' (ఏఐఆర్టీ డబ్ల్యూఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది.
నూతన 'వెహికల్ స్క్రాపేజీ పాలసీ' ముసాయిదా ప్రతిని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మార్చి 15 నోటిఫై చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇందులోని విధివిధానాలపై అభ్యంతరాలు, సూచనలను కోరుతూ 30 రోజుల గడువు ఇచ్చింది. ఈరంగంలోని నిపుణుల్ని, కార్మిక సంఘాలతో సుదీర్ఘంగా చర్చించాకే కొత్త విధానంపై ముందుకువెళ్లాలని ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ డిమాండ్ చేస్తోంది. ఈ కొత్త విధానం ఆటోమొబైల్ తయారీ రంగంలో బడా కార్పొరేట్లకు ప్రయోజనం కల్పించేవిధంగా తయారు చేశా రని 'ఢిల్లీ సైన్స్ ఫోరం'కు చెందిన రఘునందన్ విమర్శించారు.
కేంద్రం నుంచి ఈ ప్రకటనరాగానే ప్రయివేటు ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, ఈ రంగంలోని పనిచేస్తున్న డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త విధానం అమల్లోకివస్తే, ఆయా కేటగిరీల్లోని వాహనాలకు ఫిటినెస్ టెస్ట్ తప్పనిసరి అవుతుంది. రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాలన్నింటికీ ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఒకవేళ ఫిటనెస్ టెస్ట్ నెగ్గినా..ఆ వాహనానికి మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాలి. ఇందుకోసం భారీ మొత్తంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ' (ఆర్టీఏ)కి పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ప్రయివేటు వాహనదారులకు, వాటిని జీవనోపాధిగా కలిగివున్నవారికి పెద్ద తలకాయనొప్పి వ్యవహారంగా మారుతుంది. మధ్యదళారుల్ని ఆశ్రయించటం, ఆర్టీఏ చుట్టు తిరగటం వంటివి నిత్యకృత్యంగా మారుతుంది.
ఫిట్నెస్ టెస్ట్ తప్పనిసరి :కేంద్రమంత్రి గడ్గరీ
కొత్త రెగ్యులేటరీతో కూడిన పాలన రవాణారంగంలో ఏప్రిల్ 2022 నుంచి రాబోతోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్గరీ ఈ ఏడాది మార్చిలో లోక్సభలో ప్రకటించారు. 15ఏండ్లు నిండిన ప్రభుత్వ ప్రయివేటు వాహనాలు, 20ఏండ్లు నిండిన వ్యక్తిగత వాహనాల్ని నిషేధించే విధంగా నూతన 'వెహికల్ స్క్రాపేజీ పాలసీ' తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. జూన్ 2024 తర్వాత అన్ని రకాల వాణిజ్య వాహనాలకు ఫిట్నెస్ టెస్ట్ తప్పనిసరి చేస్తామని ఆయన అన్నారు. పాత వాహనాన్ని తక్కుకింద అమ్మేసినట్టయితే, కొత్త వాహనాన్ని కొనుగోలు చేసిన సమయంలో పన్నుల (జీఎస్టీ, రోడ్డు ట్యాక్సీ) నుంచి మినహాయింపు ఇవ్వాలనే ఆలోచన ఉందని అన్నారు.
కరోనా సంక్షోభం కొట్టిన దెబ్బకు రవాణా రంగం తీవ్రంగా నష్టపోయినవేళ, మోడీ సర్కార్ తెరమీదకు తెచ్చిన 'వెహికల్ స్క్రాపేజీ' విధానం మరింత ఆందోళన కలిగిస్తోందని ట్రాన్స్పోర్ట్ యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంధన ధరలు, వాహన బీమా ధరలు అమాంతం పెంచేసి, టోల్ ట్యాక్సీలు విధించి...ఇంకా ఈ వాహనరంగానికి ఏదో చేస్తున్నామని కేంద్రంలోని పాలకులు చెబుతున్నారని యూనియన్లు విమర్శిస్తున్నారు. ఈ కొత్త విధానం అమల్లోకివస్తే, వాహనరంగంపై ఆధారపడ్డ కార్మికుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందని యూనియన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
పెనం మీద నుంచి పొయ్యిలోకి...
ఈ దేశంలో నడుస్తున్న మొత్తం వాణిజ్య వాహనాల్లో 80శాతం 'డ్రైవరే యజమాని'గా నడుపుకుంటున్నవి ఉన్నాయి. ఈ సంక్షోభం కారణంగా వాహన రుణాల నెల వాయిదాలే కట్టలేకపోతున్నారు. మరోవైపు ప్రయివేటు ఫైనాన్స్ కంపెనీల నుంచి వేధింపులున్నాయి. ఇంధన ధరలు, టోల్ ట్యాక్సీలు..ఇవన్నీ తీవ్రంగా దెబ్బకొడుతున్నాయి. ఇది సరిపోదన్నట్టు...మోడీ సర్కార్ 'వెహికల్ స్క్రాపేజీ పాలసీ'ని తీసుకొచ్చింది. ఈ కొత్త పాలసీ ఆటోమొబైల్ తయారీ రంగంలోని బడా కార్పొరేట్లకు ప్రయోజనం తప్ప, సాధారణ కార్మికులకు కాదు.
నష్టాల ఊబిలో ఉన్నాం : కె.కె.దివాకరన్, ప్రధాన కార్యదర్శి, ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్