Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రైబల్ కౌన్సిల్ ఎన్నికల్లో పరాజయం
- 28కి 18 స్థానాల్లో టీఐపీఆర్ఏ గెలుపు
అగర్తలా: త్రిపుర ట్రైబల్ కౌన్సిల్ ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. 28 స్థానాలకు గానూ తొమ్మిది స్థానాల్లో మాత్రమే గెలిచి బీజేపీ కూటమి పరాజయం పాలయింది. కీలకమైన ఈ ఎన్నికల్లో దేశీయ ప్రగతిశీల ప్రాంతీయ కూటమి(టీఐపీఆర్ఏ) 18 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. మరో స్థానం స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు. ఈనెల 6న జరిగిన త్రిపుర అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్(ఏడీసీ) ఎన్నికల ఫలితాలు శనివారం నాడు విడుదలయ్యాయి. కౌన్సిల్‌లోని 30 స్థానాలకు గానూ 28 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా, మిగతా ఇద్దరు అభ్యర్థులను గవర్నర్ నామినేట్ చేస్తారు. ఎన్నికల్లో త్రిపుర స్వదేశీ పీపుల్స్ ఫ్రంట్(ఐపీఎఫ్టీ)తో కలిసి బీజేపీ కూటమిగా పోటీచేసింది. సీఏఏ ఆందోళనపై వచ్చిన విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మాణిక్య దేవ్ బర్మన్ గతేడాది సెప్టెంబర్‌లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి టీఐపీఆర్ఏను విడుదల చేశారు.నామినేషన్లకు ముందు నుంచే బపీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో వామపక్ష పార్టీలకు చెందిన కార్యాలయాలు, నేతల ఇండ్లపై దాడులు చేస్తూ భయాందోళనకర పరిస్థితులు సృష్టించింది. ఆ తరువాత నామినేషన్లు వేసిన లెఫ్ట్‌ఫ్రంట్ అభ్యర్థులపై పలు విధాలుగా బెదిరింపులకు పాల్పడ్డారు. లెఫ్ట్‌ఫ్రంట్ అభ్యర్థులను కనీసం సరిగ్గా ప్రచారం చేసుకోనివ్వలేదు. సీపీఐ(ఎం)బ నేతృత్వంలోని లెఫ్ట్‌ఫ్రంట్ పార్టీలకు చెందిన ఓటర్లు, సానుభూతిపరులు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు కూడా వెళ్లేందుకు భయపడేలా భయానక పరిస్థితులను ఏర్పాటు చేశారు. దీంతో ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్ ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశం లేకపోయిందని స్థానిక నేతలు పేర్కొన్నారు. 2015లో జరిగిన ఈ కౌన్సిల్ ఎన్నికల్లో సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్‌ఫ్రంట్ 25 స్థానాల్లో విజయం సాధించింది.