Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2020-21లో 9 శాతం పతనం
- నాలుగేండ్ల కనిష్టానికి వాడకం
- అధిక ధరలు, లాక్డౌన్ ఎఫెక్ట్
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరం 2020-21లో దేశంలో ఇంధన వినియోగం 9 శాతం పడిపోయింది. ప్రధానంగా కరోనా, లాక్డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఆ ప్రభావం పెట్రోల్, డీజిల్ డిమాండ్‌పై పడింది. దీంతో నాలుగేండ్ల కనిష్టానికి చమురు వాడకం పడిపోయింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనలిసిస్ సెల్ గణంకాల ప్రకారం.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశ మొత్తం ఇంధన వినియోగం 194.63 మిలియన్ టన్నుల (ఎంటీ)కు పడిపోయింది. ఇంతక్రితం ఏడాదిలో 214.13 మిలియన్ ట2019-20లో పెట్రోల్ వాడకం 30 ఎంటీలుగా ఉండగా.. 2020-21లో ఇది 6.75 శాతం తగ్గి 28 ఎంటీలకు పరిమితమైంది. లాక్డౌన్ అనంతరం ఏడాది చివరి మాసాల్లో వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యతనివ్వడంతో ఈ ఇంధన వినియోగం కొంత పెరిగింది. మరోవైపు వంట గ్యాస్ వాడకం 5 శాతం పెరిగి 27.95 ఎంటిలకు చేరింది. డీజిల్ వాడకం 72.72 ఎంటీలకు పడిపోయింది. ఇంతక్రితం ఏడాది 2019-20లో ఇది 82.60 ఎంటీలుగా నమోదైంది. ఆర్థిక కార్యకలాపాలు భారీగా తగ్గడంతో డీజిల్ వినియోగం తగ్గింది. కాగా ఈ ఇంధన వాడకం వరుసగా రెండో ఏడాది తగ్గడం విశేషం. 2018-19లో83.53 ఎంటీలుగా నమోదయ్యింది.
2020-21లో డీజిల్ వాడకం ఐదేండ్ల కనిష్టానికి పడిపోయింది. ఇంతక్రితం అత్యల్పంగా 2014-15లో 69.42 ఎంటీలుగా ఉంది. విమానయాన ఇంధనం ఏటీఎఫ్ వాడకం సగం పైగా పడిపోయింది. కరోనా, లాక్‌డౌన్‌కు తోడు దేశంలో ఇంధన ధరలు విఫరీతంగా పెరగడం కూడా డిమాండ్‌ను దెబ్బతీశాయని నిపుణులు పేర్కొంటున్నారు.
మార్చి ముగింపు సమయంలో కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 100 మార్క్‌ను చేరిన విషయం తెలిసిందే. అధిక ధరలతో వినియోగదారులు బెంబేలెత్తడమూ ఇంధన వినియోగం తగ్గడానికి ఓ ప్రధాన కారణంగా ఉంది.
రూపాయి దిగాలు
ఐదు రోజుల్లో 161 పైసలు పతనం
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ వెలవెల పోతోంది. డాలర్‌తో పోల్చితే ఐదు రోజుల్లో రూపాయి విలువ 161 పైసలు క్షీణించి.. శుక్రవారం 74.73 వద్ద ముగిసింది. బుధవారం ఒక్కరోజే 105 పైసలు పతనం కావడం గమనార్హం. వారాంతం సెషన్లో మరో 15 పైసలు కోల్పోయి 74.73 వద్ద ముగియడంతో.. రూపాయి విలువ 2019 నవంబర్ 4 నాటి కనిష్టానికి పడిపోయింది. దేశంలో పెరుగు తున్న కరోనా కేసులు, స్టాక్ మార్కెట్ల నష్టాలు, డాలర్ల పట్ల మదుపరుల మక్కువ తదితర అంశాలు రూపాయి విలువను ఒత్తిడికి గురి చేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు దిగుమతులు పెరగడం రూపాయి విలువపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
వాహన అమ్మకాలకు ధరల సెగ
న్యూఢిల్లీ : దేశంలో అమాంతం పెరిగిపోతున్న ఇంధన ధరలు వాహన అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. గడిచిన మార్చిలో మొత్తంగా ప్రయాణికుల వాహనాల అమ్మకాలు స్వల్పంగా పెరిగినా.. ద్విచక్ర వాహన విక్రయాలు పడిపోయాయి. దేశంలోని 1482 ఆర్డీఓ ఆఫీసులకు 1277 ఆర్టీఓల నుంచి వచ్చిన రిజిస్ట్రేషన్ల సమాచారం ప్రకారం.. 2021 మార్చిలో ద్విచక్ర వాహన విక్రయాలు 35.26 శాతం క్షీణించాయి. 2020 ఇదే మాసంలో 11,95,445 యూనిట్ల అమ్మ కాలు జరిగాయి.గడిచిన మార్చిలో వాణిజ్య వాహనాలు 42.2 శాతం తగ్గి 67,372 యూనిట్లకు, త్రిచక్ర వాహ నాల అమ్మకాలు 50.72శాతం క్షీణతతో 38,034కు పడిపోయాయి. మొత్తం అన్ని విభాగాల్లో కలిపి విక్రయాలు 28.64 శాతం పతనంతో 23,11,687 యూనిట్ల నుంచి 16,49,678 యూని ట్లకు పరిమితమయ్యాయి. 'కరోనా మహమ్మారి సుమారు 3.2 కోట్ల మంది మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితిపై ప్రభావం చూపింది. ఇంధనం, వాహనాల ధరలు పెరగడం వల్ల కూడా వాహనాల కొనుగోలు తగ్గింది' అని ఫాడా అధ్యక్షుడు వింకేశ్ గులాటీ పేర్కొన్నారు.
మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు వెనక్కి..!
న్యూఢిల్లీ : దేశంలో కరోనా రెండో దశ విజృంభించడంతో విదేశీ పోర్టుపోలియే ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్ల నుంచి తమ నిధులను వెనక్కి తరలించుకు పోయే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ పేర్కొంది. ప్రతీ రోజు వైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో మదుపర్లలో ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయని తెలిపింది. భారత విత్త మార్కెట్ల పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో గడిచిన కొన్ని మాసాల్లో ఇక్కడి ఈక్విటీ మార్కెట్లకు మద్దతు లభించిందని పేర్కొంది.