Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యమమే మార్గం
- రైతు సంఘాల నేతలు స్పష్టం
న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లో నాలుగు నెలలకుపైగా ఆందోళన చేస్తున్న రైతులు కరోనాకు తాము ఎంతమాత్రం భయపడబోమని, తమ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. 'మాస్కులు తప్పనిసరిగా ధరించడం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం లాంటి ఆవశ్యకతల గురించి సింఘూ సరిహద్దు వద్ద వేదికపై నుంచి మైకుల్లో ప్రకటనలు చేస్తున్నాం. కరోనా టీకా తీసుకునేలా వారిని ప్రోత్సహిస్తున్నాం' అని ఆలిండియా కిసాన్ సభ పంజాబ్ ఉపాధ్యక్షుడు లఖ్బీర్ సింగ్ చెప్పారు. 'ఆందోళన చేస్తున్న ప్రదేశాల్లో పదుల సంఖ్యలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఎవరికైనా జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లాంటి కోవిడ్ తరహా లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులు వారికి చికిత్స అందిస్తారు. అవసరమైతే ఆస్పత్రుల్లో చేర్పించడం, వారం పదిరోజులు ఊరికి పంపించడమో చేస్తారు' అని భారతీయ కిసాన్ యూనియన్ (డకౌండా) ప్రధాన కార్యదర్శి జగ్మోహన్ సింగ్ చెప్పారు.ఆందోళన చేస్తున్న ప్రాంతాలేవీ కోవిడ్ హాట్స్పాట్లుగా మారలేదని, అందువల్ల రైతుల వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ చెప్పారు. గతంలో షహీన్‌బాగ్ ఆందోళనను భగం చేసినట్టు తమ ఉద్యమాన్ని నిలిపివేయడం కేంద్రానికి వీలు పడదని ఆయన అన్నారు.